English | Telugu
'F3' కలెక్షన్ల జోరు.. సీనియర్ హీరోల్లో వెంకటేష్ టాప్!
Updated : May 31, 2022
'F3' మూవీ కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.35 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ.. మండే టెస్ట్ కూడా పాస్ అయింది. మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన ఎఫ్-3 నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ అదే జోరు చూపించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటిరోజు 10.35 కోట్ల షేర్ రాబట్టిన 'F3' మూవీ.. రెండో రోజు 8.35 కోట్లు, మూడో రోజు 8.85 కోట్లు, నాలుగో రోజు 4.68 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగు రోజులలో ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో 32.23 కోట్ల షేర్(51.65 కోట్ల గ్రాస్) వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.53.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 59.90 శాతం రికవరీ సాధించింది. నాలుగు రోజుల్లో నైజాంలో 14.24 కోట్లు(బిజినెస్ 18 కోట్లు), సీడెడ్ లో 4.27 కోట్లు(బిజినెస్ 8.40 కోట్లు), ఆంధ్రాలో 13.72 కోట్ల(బిజినెస్ 27.40 కోట్లు) షేర్ వచ్చింది. తెలంగాణలో ఈ వారం బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకునే అవకాశమున్న 'F3'.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కష్టపడాల్సి ఉంది.
వరల్డ్ వైడ్ గా మొదటిరోజు 13.65 కోట్లు, రెండో రోజు 9.85 కోట్లు, మూడో రోజు 11.05 కోట్లు రాబట్టిన F3 మూవీ నాలుగో రోజు కూడా 5.40 కోట్ల షేర్ తో సత్తా చాటింది. నాలుగు రోజుల్లో కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 2.02 కోట్లు, ఓవర్సీస్ లో 5.70 కోట్ల షేర్ రాబట్టిన 'F3'.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 39.95 కోట్ల షేర్ (66.70 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 63.60 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 62.81 శాతం(39.95 కోట్ల షేర్) రికవరీ సాధించింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఈ మూవీ 24 కోట్ల దూరంలో ఉంది.
ఓవర్సీస్ లోనూ 'F3' సత్తా చాటుతోంది. యూఎస్ఏలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. మిగతా సీనియర్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లకు రెండేసి 1 మిలియన్ సినిమాలు ఉండగా.. వెంకటేష్ ముచ్చటగా మూడోసారి ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో వెంకటేష్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'F2' సినిమాలు ఈ ఫీట్ సాధించాయి. అలాగే వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది నాలుగో 1 మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. గతంలో 'ఫిదా', 'తొలిప్రేమ', 'F2' సినిమాలతో వరుణ్ 1 మిలియన్ మార్క్అందుకున్నాడు.