English | Telugu
ప్రివ్యూ చూస్తు బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రముఖ దర్శకుడి మృతి
Updated : Jul 10, 2025
ఆమని(Aamani)ప్రధాన పాత్రలో 'తెలంగాణ'(Telangana)జానపద కళారూపమైన ఒగ్గు కథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాండ'(Brahmanda). బలగం జయరాం, ఆనంద్ బాల్సాద్, రవి, దేవిశ్రీ, కార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18 న విడుదలకి సిద్ధమవుతున్న 'బ్రహ్మాండ' కి 'సండ్ర నగేష్ అలియాస్ రాంబాబు'(Rambabu)దర్శకుడు.
నాలుగురోజుల క్రితం హైదరాబాద్(Hydearabad)లోని ప్రసాద్ ల్యాబ్(Prasad Lab)లో 'బ్రహ్మాండ' మూవీకి సంబంధించిన ప్రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రివ్యూ చూస్తున్న రాంబాబు ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యాడు. దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందించారు. ఆ తర్వాత నిమ్స్ కి తరలించారు. చివరికి పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడు. బ్రహ్మాండ చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు రాంబాబు మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేసారు.
రాంబాబు అంత్య క్రియలు ఆయన స్వగ్రామమైన మెదక్ జిల్లా శివంపేట మండలం, అల్లీపూర్ గ్రామంలో నిన్న జరిగాయి. సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న రాంబాబు దాదాపుగా 150 సినిమాలతో పాటు కొన్ని సీరియల్స్ కి దర్శకత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో పని చేసాడు. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోలో దర్శకుడుగా 'బ్రహ్మాండ' మొదటి మూవీ.