'మేజర్' మాసివ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
on Feb 4, 2022

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ మే 27న విడుదల కానున్నది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌తో శేష్ ప్రకటించారు. "ఈ వేసవి మాసివ్ కానున్నది. 2022 మే 27న వరల్డ్‌వైడ్‌గా మేజర్ రిలీజవుతుంది. #MAJOR ka promise hai Yeh." అని ఆయన రాసుకొచ్చారు. నిజానికి ఈ మూవీని ఫిబ్రవరి 11న విడుదల చేయాలని ఇదివరకు అనుకున్నారు. అయితే దేశంలో పలు చోట్ల కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో చిత్రాన్ని విడుదల వాయిదా వేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం మేకర్లు ప్రకటించారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో మే 27న 'మేజర్'ను రిలీజ్ చేయాలని సంకల్పించారు. శశి కిరణ్ తిక్క దర్వకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. 'మేజర్' సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ 'హృదయమా' అనే పాటతో మొదలుపెట్టారు. ఈ పాటకు విశేషమైన స్పందన లభించింది. Also read: మెగాస్టార్ లేకుండానే 'గాడ్ ఫాదర్' షూట్.. వెళ్ళిపోతూ కెమెరాకి చిక్కిన నయన్!
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కించారు. ఇందులో 'మేజర్' సందీప్ బాల్యం నుంచి ఆయన జీవితం సాగిన వైనం చూపించనున్నారు. ముంబై అటాక్, మేజర్ వీర మరణం వంటి సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయంటున్నారు. Also read: హీరోయిన్ పుట్టుమచ్చలపై పిచ్చి ప్రశ్న.. సారీ చెప్పిన ప్రొడ్యూసర్!
శోభితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలను పోషించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



