English | Telugu
'దేవర' సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది!
Updated : Jul 30, 2024
'దేవర' (Devara) నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన "ఫియర్ సాంగ్" (Fear Song) పెద్ద హిట్ అయింది. దీంతో సెకండ్ సింగిల్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఖరారైంది. (Devara Second Single)
త్వరలోనే దేవర సెకండ్ సింగిల్ ని విడుదల చేయనున్నట్లు హింట్ ఇస్తూ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆగష్టు మొదటి వారంలోనే సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ అని సమాచారం. ఈ సాంగ్ లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర' చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.