English | Telugu

ఖోఖో మూవీ రివ్యూ

మూవీ : ఖోఖో
నటీనటులు: మమితా బైజు, రాజీషా విజయన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: టోబిన్ థామస్
ఎడిటింగ్: క్రిస్టీ సెబాస్టియన్
మ్యూజిక్: సిద్దార్థ ప్రదీప్
ప్రొడక్షన్ : ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్
కథ, స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం: రాహుల్ రిజి నయ్యర్
ఓటీటీ : ప్రైమ్ వీడియో

కథ :

కేర‌ళ‌లోని ఓ మారుమూల గ్రామంలోని ప్ర‌భుత్వ మ‌హిళ‌ల స్కూల్‌లో మరియా ఫ్రాన్సిస్ పీఈటీగా జాయిన్ అవుతుంది. ఈ క్ర‌మంలో ఆమె అక్క‌డి పిల్లల్లో ఉన్న ప్ర‌తిభ‌ను గుర్తించి ఓ ఖోఖో టీమ్‌ ను త‌యారు చేస్తుంది. అయితే తన భర్త చేసిన అప్పులని దృష్టిలో ఉంచుకొని మరియా ఉద్యోగానికి వస్తుంది. అదే సమయంలో స్కూల్ లోని మహిళా విద్యార్థులు ఖోఖో ఆడుతుంటే వారి తల్లిదండ్రులు వచ్చి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తారు. మరి మరియా ఫ్రాన్సిస్ టీచర్ ఆ పిల్లలని నేషనల్ లెవెల్ లో ఆడించగలిగిందా? మ‌రియాకు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? పిల్లలు టీచ‌ర్‌కు స‌హ‌క‌రించారా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఓ టీచర్ తన పిల్లలని ప్రయోజకుల్ని చేయాలని చూస్తుంటారు. అదే సమయంలో వారి వారి ప్రతిభని బట్టి ఎవరిలో ఏం ఉందో తెలుస్తుంది. ఈ సినిమాలో ఇదే ప్రధానమైన అంశం. ఓ మారుమూల గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో చదివే వారిలో ఉన్న ట్యాలెంట్ ని బయటకు తీయడంలో మరియా ఫ్రాన్సిస్ సక్సెస్ అయింది. అలాగే ఈ సినిమాని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా నీట్ గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమాని చూస్తున్నంతసేపు మన తెలుగులోని మరికొన్ని సినిమాలు కూడా గుర్తొస్తాయి‌. గోల్కొండ హైస్కూల్, కౌసల్య కృష్ణమూర్తి, సీటీమార్. అయితే వాటికి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు. కానీ ఆట ఆడాలంటే మహిళా విద్యార్థులు ఎంత ఒడిదుడుకులు దాటాలో వివరించిన సినిమా ఇది. ఈ కథ ఎక్కువ నిడివి కూడా ఉండదు. గంటా ముప్పై నిమిషాలు మాత్రమే. కథని గ్రిస్పింగ్ గా మలిచాడు దర్శకుడు ‌. ఈ మూవీ స్క్రీన్ ప్లే సినిమాని ఇంటిల్లిపాదితో కలిసి చూసేలా చేసింది. సినిమా చూస్తున్నంతసేపు మన చుట్టూ ఉండే స్కూల్ లోని విద్యార్థులే గుర్తొస్తారు.

స్పోర్ట్ డ్రామాలో ఉండే ఎమోషన్స్, ఇంటెన్స్ సీన్లు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. భారీ ఫైట్లు, కామెడీ సీన్లు లేకుండా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. అడల్ట్ సీన్లు లేవు, అసభ్య పదజాలం వాడలేదు‌. నీట్ గా ఫ్యామిలీతో కలిసి చూసేలా సీన్లని ఎడిట్ చేయడంలో మేకర్స్ జాగ్రత్తగా పడ్డారు. క్రిస్టీ సెబాస్టియన్ ఎడిటింగ్ బాగుంది. టోబినో థామస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సిద్దార్థ ప్రదీప్ మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


నటీనటుల‌ పనితీరు:

మరియాగా రాజీషా విజయన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. మమితా బైజు నటన ఆకట్టుకుంటుంది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా : స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ ఖోఖో మెప్పిస్తుంది.

రేటింగ్ : 2.5 / 5

✍️. దాసరి మల్లేశ్

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.