English | Telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara) . 'ఆర్ఆర్ఆర్' తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

'దేవర'కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న 'దేవర' ఫస్ట్ సింగిల్ (Devara First Single) ను విడుదల చేయనున్నారు. దీనికోసం చెన్నైలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పై ఓ స్పెషల్ మ్యూజిక్ వీడియోను షూట్ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు ఫుల్ లిరికల్ వీడియో రెడీ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు 'దేవర' ఫస్ట్ సింగిల్ గా టైటిల్ సాంగ్ విడుదల కానుందని తెలుస్తోంది. మే 16న అనౌన్స్ మెంట్ పోస్టర్, మే 18న ప్రోమో విడుదల చేసి.. మే 20న 'దేవర' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారట. ఇప్పటికే దేవర ఆడియో రైట్స్ దక్కించుకున్న టి సిరీస్ సైతం సోషల్ మీడియా వేదికగా "వస్తున్నా" అంటూ ఫస్ట్ సింగిల్ గురించి హింట్ ఇచ్చింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దేవర చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.