English | Telugu

క్షమాపణ చెప్పకపోతే కోర్టుకి వెళ్తా

తప్పుడు వార్తలని ప్రజలకి అందించడం అనైతికం. చట్ట విరుద్ధం కూడా..కేవలం మీ స్వార్ధం కోసం తప్పుడు వార్తలని రాస్తున్నారు. నాకు క్షమాపణ చెప్పకపోతే ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పుడు ఈ మాటలన్నీ ప్రముఖ హీరోయిన్ మెహరీన్ చెప్తుంది. తను అంతలా రియాక్ట్ కావడానికి రీజన్ ఏంటో చూద్దాం

మెహరీన్ కొన్ని రోజుల క్రితం ఎగ్ ఫ్రీజింగ్ గురించి వివరిస్తు ఒక పోస్ట్ అండ్ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. శరీరంలోని ఆరోగ్యకరమైన అండాలని భద్రపరచుకోవడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. అలా భద్రపరుచుకున్న అండాలతో ఇష్టం వచ్చినప్పుడు పిల్లలని కనవచ్చు. మెహ్రిన్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవడం ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా అండాలని సేకరించడం ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ విషయం పైనే కొన్ని వెబ్ సైట్స్ లో యూట్యూబ్ లలో ఆమె గర్భ వతి అయినట్టుగా వచ్చింది. ఎగ్ ఫ్రీజింగ్ కోసం అమ్మాయిలు గర్భవతులు అవ్వాలా అని కూడా ప్రచారం చేసారు. ఇప్పుడు ఆ పోస్టులన్నీ తొలగించాలని మెహరీన్ డిమాండ్ చేస్తుంది. ఒక వేళ తొలగించలేక పోతే చట్టపరమైన చర్యలు తీసుకోడానికి కూడా వెనుకాడనని చెప్తుంది. అలాగే క్షమాపణలు కూడా చెప్పాలని కోరుతుంది. కొంత మంది నెటిజెన్ లు ఆమెకి అండగా నిలుస్తున్నారు

2016 లో నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీరప్రేమ గాధతో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు,హిందీ, తమిళ భాషల్లో కలిపి సుమారు 20 కి పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కన్నడంలో ఒక మూవీ చేస్తుంది 2021 లో భవ్య బొష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది . ఆ తర్వాత అనివార్యకారణాల వల్ల మ్యారేజ్ ఆగిపోయింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.