English | Telugu

ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు 

ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు 

మంచు విష్ణు (manchu vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (kannappa) ప్రభాస్(prabhas)ఎంట్రీ తర్వాత కన్నప్ప రేంజ్ పెరిగింది. చిత్ర యూనిట్ నుంచి కన్నప్ప లో ప్రభాస్ నటిస్తున్నాడనే ప్రకటన రావడం ఆలస్యం. ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు కన్నప్ప గురించి ఎంక్వయిరీ చెయ్యడం ప్రారంభించారు.దాంతో విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కాస్త పాన్ ఇండియా ప్రేక్షకుల డ్రీం ప్రాజెక్ట్ గా మారింది. ప్రభాస్ ఎలాంటి క్యారక్టర్ పోషిస్తున్నాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. తాజాగా  ప్రభాస్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది

కన్నప్ప కి  ప్రభాస్ ఎంత  రెమ్యునరేషన్  తీసుకుంటున్నాడు.ఏ ముగ్గురు సినీ అభిమానులు కలిసినా ఈ విషయం మీదే మాట్లాడుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఒక్క రూపాయి  రెమ్యునరేషన్  తీసుకోకుండా కన్నప్ప లో చేస్తున్నాడు. ఇప్పుడు వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాంటింది కన్నప్ప కి ఫ్రీ గా చేస్తుండటం ప్రభాస్ మంచి తనానికి నిదర్శనం అని అంటున్నారు .ఇటీవల బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar)ఒక ముఖ్య పాత్ర చేసినందుకు ఆరు కోట్లు తీసుకున్నాడు

మోహన్ బాబు(mohan babu) ,విష్ణు లు కలిసి కన్నప్పని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal)కూడా ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నాడు.ప్రతిష్టాత్మక ప్రాజెక్టు  మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన  ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా అత్యున్నతమైన  టీం పనిచేస్తోంది. న్యూజిలాండ్ లోని మంచు కొండల్లో కూడా షూటింగ్ ని జరుపుకుంది

 

  

ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు