English | Telugu

Mark Shankar: మార్క్ శంకర్‌ను చూసేందుకు సింగపూర్ కి చిరంజీవి!

సింగపూర్‌లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ సింగపూర్ కి బయల్దేరారు. పవన్ తో పాటు అన్నావదినలు చిరంజీవి, సురేఖ కూడా పయనమయ్యారు. మార్క్ శంకర్‌కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.

అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. ఆ సమయంలో అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్, మొదట చిన్న ప్రమాదంగా భావించారు. ఆ తర్వాత ప్రమాదం తీవ్రత తెలిసి ఆందోళన చెందారు. మరోవైపు ఈ ఘటన గురించి ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. సింగపూర్ హైకమిషనర్‌ కి కూడా సమాచారం అందించారు.