Read more!

English | Telugu

'ఎన్టీఆర్ 30' నుంచి మరో అప్డేట్.. పాన్ వరల్డ్ రేంజ్ ప్లాన్ ఇది!

మొన్నటిదాకా 'ఎన్టీఆర్ 30' అప్డేట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగుతుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. అసలుసిసలు పాన్ ఇండియా సినిమా అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ఎన్టీఆర్ 30'(వర్కింగ్ టైటిల్). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 23న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. మనం మరిచిపోయిన భారత తీర ప్రాంతంలోని మృగాల్లాంటి మనుషుల కథ అంటూ ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసాడు దర్శకుడు కొరటాల శివ. ఇక అప్పటి నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యూసర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లకు కొరియోగ్రఫీ చేయబోతున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీలోని కీలకమైన సన్నివేశాలకు హాలీవుడ్ కి చెందిన బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు బిగ్ స్క్రీన్లపై అద్భుతమైన విజువల్ ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దించడం చూస్తుంటే ఎన్టీఆర్ తో కలిసి కొరటాల ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.