English | Telugu

మహేష్ బర్త్ డే కు "భాయ్" ఫస్ట్ లుక్

మహేష్ తన పుట్టినరోజు సందర్భంగా తను నటించిన "1-నేనొక్కడినే" చిత్ర డైలాగ్ టీజర్ విడుదల చేయనున్నాడు. అయితే ఇదే రోజున నాగార్జున హీరోగా నటిస్తున్న "భాయ్" చిత్రం ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తుంది. మరి మహేష్ "1-నేనొక్కడినే" చిత్రం టీజర్ తో పాటు, నాగార్జున "భాయ్" చిత్రం ఫస్ట్ లుక్ కూడా ఒకేసారి విడుదల అయితే ఇక అభిమానులకు పండగే. మరి ఈ రెండింటిలో ఏ చిత్ర ట్రైలర్ కు ఎక్కువ మార్కులు పడతాయో చూడాలి.