English | Telugu

అక్కినేని మీద మరోసారి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..మరి అక్కినేని ఫ్యాన్స్ రియాక్షన్ 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు(akkineni nageswararao)ఎదిగారు అనే కంటే, తెలుగు చిత్ర పరిశ్రమే ఆయన వల్ల ఎదిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు తెరపై ఆయన పోషించని పాత్ర లేదు.సాంఘిక, పౌరాణిక,జానపద తరహా చిత్రాలన్నింటిలోను అవలీలగా నటించి ఆయా పాత్రలకి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసిన ఘనత కూడా అక్కినేని సొంతం.ఈ రోజు ఆ మహానటుడి శత జయంతి. ఈ సందర్భంగా అక్కినేని ఘన చరిత్ర గురించి యువరత్న నందమూరి బాలకృష్ణ(balakrishna)కొన్ని వ్యాఖ్యలు చేసాడు

తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మనందరికి గర్వకారణం. నాటకరంగం నుండి చిత్రరంగం వరకు సాగిన ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణని ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన కృషి సంపాదించిన కీర్తి, ప్రతి నటునికి మార్గదర్శకంగా కూడా నిలుస్తుంది. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు.ఈ శత జయంతి రోజున ఆయన సాధించిన విజయాలను స్మరించుకుంటూ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదామని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కినేని, నందమూరి అభిమానుల్లో ఎనలేని ఆనందాన్ని తెస్తున్నాయి.పైగా బాలకృష్ణ తనకి అవకాశం దొరికినప్పుడల్లా అక్కినేని నాగేశ్వరావు నట ప్రస్థానం గురించి చాలా గొప్పగా చెప్పే బాలయ్య అక్కినేని ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.