English | Telugu

Sopathulu Review: సోపతులు రివ్యూ

మూవీ : సోపతులు
నటీనటులు: మాస్టర్ భాను ప్రకాశ్, సృజన్ , మణి ఏగుర్ల, అనూష రమేశ్, అంజిమామ తదితరులు
ఎడిటింగ్: వెంకట్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: సునీల్ ముత్యాల
మ్యూజిక్: సింజిత్ ఎర్రమిల్లి
నిర్మాతలు: వినోద్ అనంతోజు
రచన, దర్శకత్వం: అనంత్ వర్దన్
ఓటీటీ: ఈటీవి విన్

కథ:

గుడ్డు, చింటు ఇద్దరు మంచి స్నేహితులు. స్కూల్ లో ఎక్కడైనా ఇద్దరి మధ్య పోటీ ఉండద్దని అనుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ ఉండలేనంత ఫ్రెండ్ షిప్ వాళ్ళ మధ్య ఏర్పడింది. అయితే అంతా బాగుందనుకున్న సమయంలో కరోనా లాక్ డౌన్ వస్తుంది. దాంతో ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది. లాక్ డౌన్ వల్ల పనిలేకపోవడం వల్ల గుడ్డూ కుటుంబం అప్పుల్లో కూరుకుపోతుంది. దాంతో వాళ్లు మహబూబాబాద్‌ నుంచి తమ సొంతూరికి వెళ్లిపోతారు. గుడ్డూ దూరం కావడంతో చింటు ఒంటరివాడవుతాడు. గుడ్డుని కలవడానికి చింటు ప్రయత్నాలు చేస్తుంటాడు. గుడ్డు సైతం అదేవిధంగా ట్రై చేస్తుంటాడు. మరి లాక్ డౌన్ వల్ల దూరమైన చింటు, గుడ్డు మళ్ళీ కలుసుకున్నారా? ఫోటోగ్రాఫర్ గా సెటిల్ అవ్వాలనుకునుకున్న చింటు అన్నయ్య కల నెరవేరిందా లేదా అనేది తెలియాలంటే ఈ ' సోపతులు' చూడాల్సిందే.

విశ్లేషణ:

సోపతులు అంటే తెలంగాణ యాసలో స్నేహితులు అని అర్థం. తెలంగాణ యాసతో వచ్చిన సినిమాలు అరుదుగా కన్పిస్తుంటాయి. అందులోను కరోనా లాక్ డౌన్ కాన్సెప్ట్ తో కొన్ని మాత్రమే వచ్చాయి. వాటిల్లో ఈ మూవీ కాస్త ఫ్రెష్ కంటెంట్ అనే ఫీల్ ని కల్గిస్తుంది.

దీనిని సినిమా అనేకంటే ఇద్దరు పిల్లల స్నేహం అనే చెప్పాలి. దీనికి కారణం వారిద్దరు ప్యూర్ నేచురల్ గా యాక్ట్ చేశారు. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నప్పటికి కథనంతో పాటు అవి ఫ్లోలో వెళ్ళిపోతాయి. సినిమా నిడివి గంటన్నరే కాబట్టి. ఓసారి ట్రై చేయొచ్చు. అయితే మధ్యలో రెండు అసభ్య పదాలు వాడారు. అవి స్కిప్ చేస్తే హ్యాపీగా చూసేయొచ్చు.

మొదటి నలభై నిమిషాలు సినిమా కాస్త స్లోగా సాగుతుంది. కానీ ఆ తర్వాత ప్యూర్ ఎమోషన్స్, స్నేహం గురించి తన అన్నయ్యతో ఓ పిల్లాడు చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణం బాగా చూపించారు. పాటలు బాగున్నాయి. ఓ పాట ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలవలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

మాస్టర్ భానుప్రకాశ్, సృజన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : కాస్త స్లోగా సాగే డీసెంట్ మూవీ.

రేటింగ్: 2.5 / 5

✍️. దాసరి మల్లేశ్

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.