English | Telugu

నరేష్, పవిత్ర.. థియేటర్స్‌లో గోలగోల!

నరేష్, పవిత్ర.. థియేటర్స్‌లో గోలగోల!

ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్ పేర్లు మీడియా, సోషల్ మీడియాలో మారుమోగిపోయాయి. పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోబోతున్న నరేష్ అనే వార్తలతో మొదలైన వివాదం.. వారిద్దరూ హోటల్ లో ఉండగా నరేష్ మూడో భార్య ఎంటర్ అవ్వడంతో తారాస్థాయికి చేరింది. సోషల్ మీడియాలో వీళ్ళ జోడిపై తెగ మీమ్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లో అన్నాచెల్లెల్లుగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. పైగా వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ థియేటర్స్ లో ఆడియన్స్ గోలగోల చేస్తుండటం విశేషం.

మాస్ మహారాజ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఎంట్టైన్మెంట్ లేకపోయినప్పటికీ.. స్క్రీన్ మీద నరేష్, పవిత్ర కనిపించిన ప్రతిసారి థియేటర్స్ లో ఆడియన్స్ నవ్వుతూ, గోల చేస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో వాళ్ళు జోడీగా నటించలేదు.. అన్నా చెల్లెలుగా కనిపించారు. రవితేజ తల్లి పాత్రలో పవిత్ర, రవితేజకు పిల్లనిచ్చిన మామగారి పాత్రలో నరేష్ నటించారు. అంటే వరుసకు వాళ్లిద్దరూ అన్నా చెల్లెలు అవుతారు. కానీ సినిమా చూస్తున్న ఆడియన్స్ మాత్రం అలా ఫీలవలేదు. వాళ్ళు కనిపించినప్పుడల్లా గోల చేశారు. దాంతో సీరియస్ సినిమా కూడా వాళ్ళు కనిపించినంత సేపు ఆడియన్స్ కి కామెడీ సినిమా లాగ అనిపించింది.