English | Telugu
రష్మిక డార్లింగ్.. తనంటే నాకెంతో ఇష్టం!
Updated : Jul 29, 2022
కరణ్ జోహార్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 7'లో 'లైగర్' హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్యా పాండే గెస్ట్‌లుగా దర్శనమిచ్చారు. కాఫీ కోచ్‌లోకి విజయ్ తొలిసారి రాగా, తన లవ్ లైఫ్, తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ గురించి మాట్లాడింది అన్య. మొదట సిగ్గుపడిన విజయ్, తర్వాత రష్మిక మందన్న, సమంతపై తన అభిమానాన్ని సూటిగా ప్రదర్శించేశాడు. అలాగే, అతను తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించి మనకు తెలీని కొన్ని విషయాలను పంచుకున్నాడు.
తన గాళ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న రష్మిక మందన్నతో అనుబంధం గురించి మాట్లాడిన విజయ్, ఆమెను 'డార్లింగ్'గా సంబోధించాడు. "మేం ఇద్దరం 2 ఫిలిమ్స్ కలిసి చేశాం. ఆమె ఒక డార్లింగ్. ఆమెను నేను చాలా ఇష్టపడతాను. ఆమె నాకు చాలా మంచి ఫ్రెండ్. మేం మా సినిమాల గురించి, జీవితంలోని కష్టసుఖాల గురించి షేర్ చేసుకుంటుంటాం. మా మధ్య బంధం ఏర్పడింది. సినిమాల్లో త్వరగా సన్నిహితత్వం ఏర్పడుతుంది. అంతే త్వరగా బంధం వృద్ధి చెందుతుంది" అని అతను చెప్పాడు.
ప్రస్తుత రిలేషన్‌షిప్ గురించి అడిగినప్పుడు, "నేను పెళ్లిచేసుకొని, పిల్లల్ని కన్నరోజున, నా ప్రేమ విషయాన్ని చాలా గట్టిగా చెప్తాను. అప్పటిదాకా నన్ను అభిమానించే వాళ్ల మనోభావాల్ని నేను గాయపర్చను. ఒక యాక్టర్‌గా నన్ను ప్రేమించేవాళ్లు, తమ గోడలపై, తమ ఫోన్లపై నా పోస్టర్ పెట్టుకొనేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా ఎంతో అభిమానాన్నీ, ప్రేమనూ ఇస్తున్నారు. వారి హృదయాన్ని బద్దలు చేయాలని అనుకోవట్లేదు" అని చెప్పుకొచ్చాడు విజయ్.
రాఫిడ్ ఫైర్ రౌండ్‌లో ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ వుమన్ పేరును చెప్పాల్సిందిగా కరణ్ అడిగితే, "సమంత" అని జవాబిచ్చాడు విజయ్. "అమె అమేజింగ్ అండ్ ఇన్‌క్రెడిబుల్ వుమన్" అని చెప్పాడు.