English | Telugu

The Paradise: బిగ్ సర్ ప్రైజ్.. ఊర మాస్ అవతార్ లో సంపూర్ణేష్ బాబు..!

Publish Date:Dec 19, 2025

  'దసరా' తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్, 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట వంటి సినిమాలతో కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందాడు సంపూర్ణేష్ బాబు. ఇతర హీరోల సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తాడు. అయితే సంపూర్ణేష్ పేరు వింటే.. మొదట గుర్తుకొచ్చేది కామెడీనే. అలాంటి సంపూర్ణేష్.. ఇప్పుడు 'ప్యారడైజ్' కోసం మాస్ అవతారమెత్తాడు. (Sampoornesh Babu as Biryani)   'ది ప్యారడైజ్'లో నాని జడల్ అనే పాత్ర పోషిస్తుండగా, అతని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ నటిస్తున్నాడు. తాజాగా బిర్యానీ రోల్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఒంటి నిండా నెత్తుటి మరకలతో.. భుజాన గొడ్డలి వేసుకొని.. బీడీ తాగుతూ నిల్చొని ఉన్న సంపూర్ణేష్ లుక్ అదిరిపోయింది. ఈసారి తనలోని మాస్ యాంగిల్ ని చూపించబోతున్నాడని పోస్టర్ తో అర్థమవుతోంది.   Also Read: BMW టీజర్.. భార్యకు తెలియకుండా స్పెయిన్ లో భర్త రాసలీలలు!   'ది ప్యారడైజ్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా నెవర్ బిఫోర్ లుక్ లో నాని కనిపించిన తీరు సర్ ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు సంపూర్ణేష్ బాబు లుక్ చూసిన తర్వాత.. ఇందులో మరిన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నామని అనిపిస్తోంది.    

Sampoornesh Babu shocks with his look from The Paradise

Publish Date:Dec 19, 2025

The anticipation surrounding Natural Star Nani’s upcoming period action epic, The Paradise, has reached a fever pitch. Directed by Srikanth Odela, this high-budget entertainer promises a visceral blend of raw emotion and high-octane action.  Following the viral success of Nani’s initial posters, the production team has now unveiled a striking new look featuring Sampoornesh Babu. In a departure from his usual screen persona, Sampoornesh Babu appears completely unrecognizable in the role of Biryani. Tasked with portraying the epitome of loyalty, Biryani is the most trusted confidant of Nani’s character, Jadal.  To meet Odela’s specific creative vision, the actor underwent a significant physical transformation, losing considerable weight to inhabit this "massy" and rugged avatar. Produced by Sudhakar Cherukuri, this Pan-India spectacle is set for a grand multi-language release on March 26, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సూర్యకాంతం మరణం.. పట్టించుకోని టాలీవుడ్‌ ప్రముఖులు.. ఎందుకని?

Publish Date:Dec 18, 2025

(డిసెంబర్‌ 18 నటి సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..) కొందరు నటీనటులు కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా రకరకాల క్యారెక్టర్స్‌ చేసేందుకు ఇష్టపడతారు. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అలా చేస్తే రొటీన్‌ అయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఒకే తరహా పాత్రను మళ్లీ మళ్లీ చేసి మెప్పించడం సూర్యకాంతం వల్లే సాధ్యమైంది. గయ్యాళి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం.. 200 సినిమాల్లో ఆ పాత్రను పోషించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా చెయ్యగలిగారు.   సాధారణంగా సినిమాల్లో గయ్యాళి పాత్ర రాగానే ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు కోపం వస్తుంది. అయితే సూర్యకాంతం చేసే పాత్రలపై వారికి కోపం ఉంటూనే జాలి కూడా కలుగుతుంది. అలా ఆ పాత్రను సూర్యకాంతం తనదైన శైలిలో పోషించి మెప్పించారు. ఆమె చేసిన పాత్రల ప్రభావం ఎంతలా ఉండేదంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం కూడా మానేసే అంతగా. అంతకుముందు సూర్యకాంతం పేరు చాలా మందికి ఉండేది. ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారెవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టే సాహసం చెయ్యలేదు.    సినిమాల్లో అంత గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ప్రవర్తన నిజజీవితంలో దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఎంతో సౌమ్యం, మరెందో దయ, దానగుణంతో అందరికీ ప్రేమను పంచేవారు. అప్పటి హీరోలకు, మిగతా నటీనటులకు సూర్యకాంతం అంటే ఎంతో అభిమానం. ఆమె షూటింగ్‌లో ఉన్నారంటే యూనిట్‌ సభ్యులకు పండగే. ఎందుకంటే.. తను షూటింగ్‌కి వచ్చేటప్పుడు 20 మందికి సరిపడా భోజనాలు, పిండి వంటలు ఆమె వెంట వచ్చేవి. అందరితో కలిసి కూర్చొని ఆమె భోజనం చేసేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు.    సినిమాల ద్వారానే కాకుండా రకరకాల వ్యాపారాలు కూడా చేసి డబ్బు సంపాదించేవారు సూర్యకాంతం. అప్పట్లోనే పాత కార్లను కొని వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమ్మే వ్యాపారం చేసేవారు. నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఎలర్జీ వస్తోందని గ్రహించిన ఆమె.. విదేశాల నుంచి మేకప్‌ కిట్స్‌ తెప్పించి, వాటిని హీరోయిన్లకు అమ్మేవారు. ఇవి కాకుండా ఫైనాన్స్‌ కూడా చేసేవారు. ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాల కోసం సూర్యకాంతం దగ్గర ఫైనాన్స్‌ తీసుకునేవారు. ఇక బాపు, రమణ చేసిన సినిమాలన్నింటికీ ఆమే ఫైనాన్సియర్‌. అది కూడా ఎంతో న్యాయబద్ధంగా చేసేవారు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.   ఒక సినిమాకి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ ఆమె దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. దాన్ని నెలనెలా చెల్లించేవారు. అలా ఒక నెల తమ మేనేజర్‌తో డబ్బు పంపించారు రమణ. అయితే ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. అంతకుముందు నెలతోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అయిపోయాయని చెప్పారు. వడ్డీ ఎక్కువ చెబితే ఆ భయంతో డబ్బు  కరెక్ట్‌గా కడతారని భావించి డబ్బు ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ చెప్పానని, దానికి సాధారణ వడ్డీ మాత్రమే వేశానని అన్నారు. అలా లెక్కేస్తే మిగిలిన డబ్బు చెల్లించక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బును వెనక్కి పంపించేశారు సూర్యకాంతం.   తన చివరి శ్వాస వరకూ నటించాలనుకునేవారు సూర్యకాంతం. ఆమె నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎస్‌.పి.పరశురాం. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అదే సంవత్సరం డిసెంబర్‌ 18న తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చెన్నయ్‌లో జరుగుతున్న ఫారిన్‌ డెలిగేట్స్‌తో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకొని ఆ మీటింగ్‌ను గంటపాటు వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి ఆమెకు నివాళులర్పించి తిరిగి వెళ్లి మీటింగ్‌ను కొనసాగించారు. ఒక నటి కోసం ఎంతో ముఖ్యమైన ఆ మీటింగ్‌ నుంచి ఒక ముఖ్యమంత్రి హడావిడిగా వెళ్ళిపోవడం ఆమె పి.ఎ.కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యారు.   ‘షూటింగ్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సూర్యకాంతంగారు. ఆమె పెట్టిన భోజనం ఎన్నోసార్లు తిన్నాను. కొన్నిసార్లు ఆమె ఏ షూటింగ్‌లో ఉందో తెలుసుకొని లంచ్‌ టైమ్‌కి అక్కడికి వెళ్లేదాన్ని. ఆమె వంటలంటే నాకు అంత ఇష్టం. ఆమె చేతి వంట తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఈ మీటింగ్‌ కంటే సూర్యకాంతంగారిని కడసారి చూసి నివాళులు అర్పించడమే నాకు ముఖ్యం’ అన్నారు జయలలిత.   ఇదిలా ఉంటే.. సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో నామమాత్రంగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారు హాజరు కాలేదు. అర్థరాత్రి చనిపోయారు కాబట్టి మరుసటి రోజు అందరూ వస్తారని మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. ఒక మహానటికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.    సూర్యకాంతం చనిపోవడానికి ఆరు నెలల ముందు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దానిలో చాలా తక్కువ శాతం మంది సూర్యకాంతం చనిపోయినపుడు ఆమెను చూసేందుకు వెళ్లారు. సూర్యకాంతం అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నటీమణి. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎంతో మంది ఆమె నుంచి సాయం అందుకున్నారు. మరెంతో మందికి అన్నపూర్ణలా ఆమె అన్నం పెట్టారు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత వీడ్కోలు పలికేందుకు మాత్రం మనుషులు కరువయ్యారు. 

Dhurandhar OTT: కళ్ళు చెదిరేలా 'ధురంధర్' ఓటీటీ డీల్.. పుష్ప-2 రికార్డ్ అవుట్!

Publish Date:Dec 18, 2025

  బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   'ధురంధర్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. గతంలో 'ధురంధర్' ఓటీటీ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్ల డీల్ తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ వార్త నిజమైతే.. ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే బిగ్ ఓటీటీ డీల్ అవుతుంది. గతంలో 'పుష్ప-2' రైట్స్ ని రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని 'ధురంధర్' బ్రేక్ చేసినట్లు అయింది. (Dhurandhar OTT)   ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే 'ధురంధర్' స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశముంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.   Also Read: తెలుగునాట అవతార్-3 ప్రభావం.. వంద కోట్లు కష్టమేనా..?   కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ కూడా ఉంది. రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. మరి ఈ రెండు భాగాలకు కలిపి ఓటీటీ డీల్ జరిగిందా? లేక ఒక్క భాగానికే రూ.285 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధపడిందా? అనేది తెలియాల్సి ఉంది.  

Demon Pavan BB Journey video : గూస్ బంప్స్ తెప్పించిన డీమాన్ పవన్ జర్నీ వీడియో.. మొత్తం రీతూతోనే!

Publish Date:Dec 19, 2025

బిగ్ బాస్ ఈ సీజన్ లోకి కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆ కామనర్స్ లో ఇద్దరు టాప్-5 లో ఉన్నారు. వాళ్లలో డీమాన్ ఒకడు.. ఒక సామాన్య ఇంటి నుండి అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అటతో మంచి పాజిటివిటి తెచ్చుకొని టాప్-5 లో అడుగుపెట్టాడు. డీమాన్ పవన్ గురించి బిగ్ బాస్ ఎలివేషన్ ఇచ్చి చెప్తుంటే గుస్ బంప్స్ వచ్చాయి. కాసేపటికి డీమాన్ పవన్ ని బిగ్ బాస్ గార్డన్ ఏరియాకి పిలిచి తన జర్నీ వీడియో ప్లే చేశాడు. బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ రోజు నుండి మొదలు నుండి నిన్నటి వరకు సాగిన అతని ప్రయాణామ్ని ఈ జర్నీ వీడియోలో చూపించాడు. ఇందులో ఎక్కువగా రీతూతో ఉన్న మెమరీస్ ఉన్నాయి. డీమాన్ కెప్టెన్ అవ్వడం.. అది రద్దు అవడం మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవ్వడం అదంతా మంచి ఎలివేషన్ ఇచ్చి ఎడిట్ చేశాడు. రీతూతో ఉన్న షాట్స్ అన్నిటింకి లవ్ సాంగ్ ప్లే చేశాడు. అవన్నీ చూస్తూ పవన్ ఎమోషనల్ అయి ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ అవ్వడం. రీతూతో తప్పుగా బెహేవ్ చేసినప్పుడు నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళమని చెప్పడం.. అదంతా చూసి పవన్ ఏడుస్తాడు. జర్నీ వీడియో మొత్తం చూసి డీమాన్ పవన్ ఏడుస్తాడు. చాలా బాగుంది బిగ్ బాస్ నేను ఇలా ఉంటానని ఊహించలేదు.. చాలా నేర్చుకున్నా.. నాకు బిగ్ బాస్ అవకాశం అనేది పునర్జన్మ అని పవన్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తనకి నచ్చిన ఫొటోస్ అన్నీ తీసుకొని హౌస్ లోకి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ తో హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటాడు. ఎంట్రీ నుండి మొత్తం రీతూకి నీకు లవ్ సాంగ్స్ వేసినట్లున్నారని డీమాన్ పవన్ తో తనూజ అంటుంది. మరి డీమాన్ పవన్ జర్నీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

The Raja Saab: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!

Publish Date:Dec 17, 2025

  రాజా సాబ్ గురించి ఊహించని న్యూస్ కామెడీ తక్కువ.. ఎమోషన్స్ ఎక్కువ మారుతీ మ్యాజిక్ చేస్తాడా?   ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న మొదటి హారర్ ఫిల్మ్ ఇది.    'రాజా సాబ్' మూవీ హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల విందు ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.   అయితే 'రాజా సాబ్' సినిమాలో కామెడీ పెద్దగా ఉండదని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మారుతీ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. పైగా హారర్ కామెడీ అంటే.. మారుతీ మరింతగా నవ్విస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, 'రాజా సాబ్'లో కామెడీ కంటే ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట.   Also Read: వారణాసి సెట్స్ కి జేమ్స్ కామెరూన్.. టైగర్ తో షూట్!   'రాజా సాబ్'లో కామెడీ సీన్స్ తక్కువేనట. ప్రభాస్ పాత్ర మాత్రమే సరదాగా ఉంటూ.. వన్ లైనర్స్ తో అక్కడక్కడా నవ్విస్తుందట. సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారట. ఇక పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించడం ఖాయమని చెబుతున్నారు.   మారుతీ ఎమోషనల్ ఫిల్మ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకాలం కామెడీ తన బలం అని నిరూపించుకున్న మారుతీ.. ఇప్పుడు ఎమోషన్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ 'రాజా సాబ్' చూడటానికి క్యూ కడతారు అనడంలో సందేహం లేదు.  

Rajamouli to finish Varanasi shoot by next year end

Publish Date:Dec 17, 2025

SS Rajamouli has been more silent than ever about his next movie, Varanasi. He normally tends to give updates from time to time indirectly about his films but in case of Varanasi, Priyanka Chopra did share a lot before he officially announced the title with a grand teaser.  Now, he is again maintaining silence but he clearly gave an update when Hollywood legend James Cameron asked him about the film. Recently, he watched the film Avatar: Fire and Ash and interacted with Cameron to promote the film in India. Rajamouli revealed that he liked the visual spectacle that the director managed to pull off.  During their conversation, he revealed that there is 9 months more shoot to finish and one year of it is completed. Also, he stated that he would be happy to welcome the director to his sets anytime. Jokingly, Cameron stated that he would be wishing to visit the sets if Rajamouli is working with tigers or animals.  Well, Mahesh Babu finished the shoot for Ramayana portions and he is currently preparing for a huge action sequence to be shot in specially erected sets. Once that scene shoot is over, there is talkie portion that is planned to be completed at a faster pace than a regular Rajamouli film aiming to complete shoot by next year end.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969