English | Telugu
లాక్ డౌన్ సమయంలో ఇలాంటి విన్యాసాలు అవసరమా?
Updated : Apr 12, 2020
ఆంధ్రలో వైసీపీ నేతలు, కార్యక్తలు లాక్‌డౌన్ రూల్స్ ను పట్టించుకోకుండా ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. పిచ్చి ముదిరితే ఇలాగే వుంటుందని జనం చెప్పకుంటున్నారు. కరోనా బాధితుల కోసం విరాళాలు ఇచ్చిన వారి ఫొటోలను ఊరేగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. అంతే కాదు ఆందోళన కలిగించే విషయం కూడా. సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ప్రచారం కోసం ఇలా రోడ్ల మీద పడటం ఏమిటని జనం ఛీ కొడుతున్నారు. వైసిపి వారేమో చూసిన వారు స్ఫూర్తి పొంది మరిన్ని విరాళాలు ఇస్తారని రోడ్డు మీద ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
రామోజీ రావు 20 కోట్లు ఇచ్చాడు ఆయన ఫోటో ఉండదు...పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇచ్చాడు ఆయన ఫోటో ఉండదు...గల్లా జయదేవ్ కుటుంబం 8 కోట్లు ఇచ్చింది ఆయన ఫోటో ఉండదు కానీ భారతి ఫోటోను మాత్రం ఊరూరా ఊరేగిస్తున్నారు...చేసింది సాయమా లేక పబ్లిసిటీ లో భాగమా? శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ముఖం మాడ్చుకుంటున్నారట.