విశాఖ గ్యాస్ లీక్ కావడంతో వెయ్యి మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల 3కి.మీ వరకు ఈ గ్యాస్ వ్యాపించడంతో.. 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. గ్యాస్ లీక్ సమాచారంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. గ్యాస్ ప్రభావానికి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. వారిిన అంబులెన్సుల్లో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
పాప పేరు: సుచరిత. తండ్రి పేరు : రాజు. ఊరు : వెంకట పురం, గోపాలపట్నం, విశాఖపట్నం.
ఈరోజు జరిగిన L.G పొలిమెర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం వాళ్ళ అక్కడున్న చిన్నారిని చింతలగ్రహారం రైతులు కాపాడి జాగ్రత్తగా చూస్కుంటున్నారు. చిన్నారి క్షేమంగా ఉంది, ఎటువంటి కంగారు పడనక్కర్లేదు. ఈ పాప తల్లితండ్రులు 9440921522 ఫోన్ నెంబర్ కి కాల్ చేయమని వారు చెబుతున్నారు.