English | Telugu
కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే
Updated : Jun 5, 2020
తాజాగా ఈ వ్యవహారంపై.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. "కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని." అంటూ విజయసాయి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
"పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. ట్రస్టును భ్రష్టు పట్టించాడు కాబట్టే సైలెంటై పోయాడు. దర్యాప్తులో తప్పించుకోలేడు." అంటూ విజయసాయి హెచ్చరించారు.