English | Telugu

టిటిడి బర్డ్ ఆసుపత్రిలో విజిలెన్స్ దాడులు.. గత ప్రభుత్వ లోపాలపై ఫోకస్!

టిటిడి బర్డ్ ఆసుపత్రిలో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాల పై గట్టిగా ఫోకస్ పెట్టింది విజిలెన్స్ విభాగం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో జరిగిన కొనుగోళ్లు, నిధుల వినియోగం పై ఆరా తీస్తోంది. గతంలో బర్డ్ డైరెక్టర్ గా డాక్టర్ జగదీష్ ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాల పై ఫోకస్ పెట్టారు విజిలెన్స్ అధికారులు. గత ఐదేళ్ల కాలంలో జరిగింది కాబట్టి కొనుగోళ్లకు సంబంధించి కానీ నిధుల వినియోగానికి సంబంధించిన గానీ ఏ రకమైన అక్రమాలు జరిగాయి, ఏ రకంగా అవినీతి జరిగింది. నిధులు ఏ విధంగా దారి మళ్ళాయి అని పలు ఆరోపణల నేపథ్యం లోనే విజిలెన్స్ దాడులు అయితే కొనసాగుతున్నట్లు సమాచారం.

గతంలో డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ చాలా కాలంగా డైరెక్టర్ గా కొనసాగిన నేపథ్యంలో గత ఐదేళ్లలో ఏ రకమైన పాలనా పరమైన వైఫల్యాల జరిగాయి. ఇందుకు సంబంధించి పలు ఆరోపణల నేపథ్యం లోనే అధికారులు విజిలెన్స్ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయిదేళ్ల కాలంలో పరికరాల కొనుగోలుతో పాటు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ రకమైన అక్రమాలు జరిగాయి. ఇందుకు సంబంధించి జగదీష్ తీసుకున్న నిర్ణయాలకు ఫోకస్ చేసినట్లు సమాచారం. విజిలెన్స్ డీఎస్పీ మల్లీశ్వర్ రెడ్డి తో పాటు విజిలెన్స్ అధికారులతో కూడా తిరుపతి లోని బర్డ్ ఆస్పత్రిలో తనిఖీలు చేయటమే కాక ప్రధానంగా రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద విజిలెన్స్ అధికారులు సర్వత్రా ఆరా తీస్తున్నట్లు సమాచారం.