English | Telugu
స్వరూపానందకి తాకిన రాజధాని ఉద్యమ సెగ...
Updated : Feb 7, 2020
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నంద సరస్వతికి అమరావతి ఉద్యమ సెగ తగిలింది. శుక్రవారం గుంటూరులోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే ఆద్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన స్వామీజీని రాజధాని మహిళలు అడ్డుకున్నారు. అమరావతి మద్దతుగా 'జై అమరావతి' నినాదాలు చేస్తూ తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. రాజధానిని మార్చవద్దని ఏపి సీఎం జగన్ కు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగిన మహిళలను స్థానిక వైసీపీ నేతలు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆలయం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్వామీజీని అక్కడినుండి తీసుకెళ్ళారు.