English | Telugu
జగన్ జనసేన సాయం కోరాడా!!
Updated : Apr 12, 2020
* పక్క దేశం పోవాలన్నా పోలీస్ క్లియరెన్స్ కావాలని పవన్ అభిమాని సెటైర్
కరోనా సమయాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేనట్టుంది పాలక వై ఎస్ ఆర్ స్సి పీ, విపక్ష జనసేన ల వైఖరి చూస్తుంటే. విజయసాయిరెడ్డి, కొణిదెల నాగబాబు ల మధ్య నడిచిన ట్విటర్ యుద్ధం, అలాగే పరస్పరం ఆయా పార్టీల అభిమానుల ట్వీట్లు, కరోనా టైం లో జనానికి కావాల్సినంత మసాలా అందిస్తున్నాయి.
విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో -"కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?," అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.
దాంతో అగ్గి మీద గుగ్గిలమైన నాగబాబు ఇలా రిటార్ట్ ఇచ్చారు-" నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకుతెలుసు విజయ సాయి రెడ్డి..మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి."
వారిద్దరి కామన్ స్నేహితుడెవరో కానీ, ఓ పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రం ఇలా రెస్పాండ్ అయ్యాడు-" అయ్యా కసాయి రెడ్డి... మాకు గ్రౌండ్, గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోయినా.. నీకు పక్క దేశం పోవాలంటే పోలీస్ క్లియరెన్స్ కావాలి... అది చూడు.. మాకు ఏం లేదు అంటారు.. చూపిస్తే గంటకొకడు ప్రెస్ మీట్ లు పెట్టి పిసికేసుకుంటారు," అంటూ వ్యంగ్య ట్వీట్లు సంధించాడు.
ఇంకొక ట్వీట్ వీరుడు అయితే సుతిమెత్తగా ఇలా సెటైర్ విసిరాడు.." నిజమే మాకు గ్రామస్థాయిలో పెద్దగా బలం లేదు అలానే సిబిఐ కోర్టులో మా మీద 38 అవినీతి కేసులు కూడా లేవు," అని. మరి ఫర్దర్ గా విజయసాయి రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో ఏమిటో...