English | Telugu
'ఐఏఎస్ లు గరం గరం... నిమ్మగడ్డకు బాసట' అంటూ తప్పులో కాలేసిన తెలుగుదేశం
Updated : Apr 12, 2020
* తెలుగు దేశం క్లెయిమ్ చేసినట్టు దీన్ని ఐ ఏ ఎస్ లు నడపడం లేదు..
* ప్రద్యుమ్న సింగ్ అనే వ్యక్తి "ఐ ఏ ఎస్ ఫ్రాటెర్నిటీ" ట్విట్టర్, ఫేస్ బుక్ లకు హ్యాండ్లర్ గా ఉన్నాడు
* FB పేజీ about లో ఉన్న విషయం మీరే చదవండి: IAS Fraternity shapes India's public administration, policy formulation & implementation. Our RTs & tweets DON'T represent official stand of IAS Association.
* జాతీయ స్థాయిలో విజ్ఞులు ఛీ కొడుతున్నారంటూ-భారత ఐ ఏ ఎస్ అధికారుల సంఘం పేరిట తెలుగుదేశం ట్వీట్, ఆ లింక్ ఇదే -
కరోనాను కట్టడి చేయడంలో తలమునకలై ఉండాల్సిన ప్రభుత్వం... కక్ష రాజకీయాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించడం పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ గారు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ట్వీట్ చేసిన తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన ట్విట్టర్ లింక్ లను కూడా షేర్ చేసింది.
1. /> 2. /> 3.
అలాగే- IAS fraternity మరొక ట్వీట్ కూడాచేసింది--" When IAS officers are busy in crisis management. Shameless Andhra Pradesh Govt brings notification to remove its State Election Commissioner Dr. N. Ramesh Kumar, retd. IAS due to ‘caste bias’ and another notification first of its own kind in which SEC will be a retd. HC judge." తొలిసారిగా ఇంత హార్ష్ ట్వీట్ ఆ గ్రూప్ నుంచి వెలువడటంతో రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం తో ఐ ఏ ఎస్ లు ఎంత గరం గరం గా ఉన్నారో అర్ధం అవుతోందంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. కానీ, వాస్తవానికి చూస్తే, ఐ ఏ ఎస్ అధికారుల జాతీయ సంఘానికీ, తెలుగుదేశం పార్టీ ట్వీట్ కూ ఎలాంటి సంబంధమూ లేదనేది, FB హ్యాండ్లర్ ప్రద్యుమ్న సింగ్ about ఇన్ఫర్మేషన్ లో స్పష్టంగా తెలిసిపోయింది. ఐ ఏ ఎస్ అధికారులు ఏదైనా ఒక సమాచారం మీడియాకు ఇవ్వదలిస్తే, ప్రాపర్ గా ఆ సమాచారాన్ని అసోసియేషన్ లెటర్ హెడ్ మీద, బాధ్యుల సంతకంతో రిలీజ్ చేస్తారు. ఇక్కడ అది జరగలేదు. నిమ్మగడ్డ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి, ఆయనకు కులం ఆపాదించి ఎంత అప్రదిష్ట పాలైందో, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, ట్విట్టర్ వేదికగా అదే స్థాయి లో నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మైలేజ్ పొందాలని అభాసు పాలయ్యారు. ఈ విషయం లో పాలక వై ఎస్ ఆర్ సి పి, అలాగే విపక్ష టీ డీ పీ కూడా దొందూ దొందే పద్దతి లో వ్యవహరించి, జనం దృష్టిలో పలుచనయ్యాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం లో నుంచి, తెలుగుదేశం పార్టీ ఇలా అవకాశం సృష్టించుకుందన్న మాట! భేష్!!!