English | Telugu
హుజూర్‌నగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం.. రికార్డు మెజారిటీ!!
Updated : Oct 24, 2019
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తనకి తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కారు జోరుకి హస్తం కుదేలైంది. హుజూర్‌నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం మొదలుకుని చివరి రౌండ్ వరకూ కారు స్పీడ్ గా దూసుకెళ్లింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ హస్తం హవా కనిపించలేదు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీల సంగతి సరేసరి. ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమవ్వగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి మూడో స్థానం దక్కించుకున్నారు.
పార్టీ ఓట్లు
టీఆరెఎస్ 112796
కాంగ్రెస్ 69563
బీజేపీ 2621
టీడీపీ 1827