English | Telugu
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి.. అరగంట పాటు టెన్షన్!
Updated : Nov 6, 2020
మంత్రి కొప్పుల ఈశ్వర్ సైఫాబాద్ లోని సామ్రాట్ అపార్ట్ మెంట్స్ లో బుడగ జంగాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్టులో కిందికి వస్తుండగా అది సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది.తిరిగి రీస్టార్ట్ చేసినా పైకి, కిందికీ తిరిగిందే తప్ప ఆ లిఫ్టు గ్రిల్స్ తెరుచుకోలేదు. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. సామ్రాట్ అపార్ట్ మెంట్స్ లోని లిఫ్టు చాలా పాతది కావడం, మంత్రిపాటు అనేకమంది ఎక్కడంతో ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయినట్టు భావిస్తున్నారు.