English | Telugu

సీఎం జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈనెల 16న విచారణ

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాసి ఉద్దేశపూర్వకంగా దాన్ని బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్ పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ జరపనుంది. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని.. సుప్రీంకోర్టు లాయర్లు జీఎస్ మణి, సునీల్ కుమార్ సింగ్, ప్రదీప్ కుమార్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణ వేగవంతం అవుతున్న ప్రస్తుత దశలో.. న్యాయమూర్తుల్ని బెదిరించేందుకు ఇలా చేశారని.. అనేక మంది న్యాయనిపుణులు, న్యాయకోవిదులు సీఎం జగన్ తీరు కోర్టు ధిక్కరణగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో జగన్ కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై కొన్ని ఆరోపణలు చేశారు. అయితే న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడానికి ఓ పద్దతి ఉంటుంది. కానీ సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. దాడికి పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.