లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ తెలంగాణ పదో తరగతి పరీక్షలను నిర్వహించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు నిర్వహిస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే పరీక్షలు రాసే విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది.
అయితే, జూన్ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతున్నట్లయితే, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది.