English | Telugu
నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలి!
Updated : Apr 1, 2020
కరోనా నివారణ చర్యలతో ఎవరు నష్ట పోకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తత్సరం చేయడం తగదని,
తెలంగాణ రాష్ట్రంలో భావన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సెస్ లో ఉన్న 2300 కోట్లు నిధిని కార్మికుల సంక్షేమనికి వినియోగించాలని ఎం.పి. కోరారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలకు ఆర్డర్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు. కార్మిక సంక్షేమ నిధి కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న 8 లక్షల 50వేళా మంది కార్మికులతో పాటు నమోదు చేసుకొని వారికి కూడా ఆర్థిక సహాయం అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.