English | Telugu

వలసదారుల జీవితాలతో ఆడుకోవ‌ద్దు! ఒవైసీ ట్వీట్!

వలసదారుల సంక్షేమం కోసం ఎలాంటి ఆలోచన చేయకుండా లాక్ డౌన్ విధించి కేంద్ర ప్ర‌భుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోంద‌ని ఒవైసీ ఆరోపించారు. ఇది ఏ తరహా లాక్‌డౌన్? అంటూ ఆయ‌న సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీ, జైపూర్‌లో వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పడుతున్న అవస్థలపై ఆయన ప్రశ్నించారు. వలస వచ్చి బతుకుతున్నవారు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించరు. ప్రభుత్వం ఢిల్లీలో యూపీ వలసదారులను వెనక్కి నెట్టగలిగితే, తెలంగాణ కూడా బిహార్ యూపీ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ నుంచి ఇక్కడికి వచ్చిన ఒంటరి వలసదారులను అలాగే చేయాలా?’’ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
పశ్చిమ బంగాల్, యూపీ, బిహార్ ప్రభుత్వాలు ఇలా చిక్కుకు పోయిన వలసదారులకు ఎలాంటి సాయం చేయట్లేదని ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఇలా ఆడుకోవద్దని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.