English | Telugu
వల్లభనేని వంశీ సిఎం జగన్ తో కలిసి పని చేయనున్నారా..?
Updated : Oct 25, 2019
సీఎం జగన్ తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం వద్దకు వెళ్లిన వంశీ అరగంట పాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తనపై పెట్టిన అక్రమ కేసులను సీఎంకు వివరించినట్లు సమాచారం. కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ తో వంశీ చెప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అదే విధంగా మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి పేర్ని నాని ఇరువురూ కలిసి వల్లభనేని వంశీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్ళారు. సుమారు అరగంట సేపు భేటి అయ్యారు, ఈ భేటీలో ప్రధానంగా తనపై పెట్టిన కేసు గురించి వివరించినట్లు తెలుస్తోంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు అని చెప్తూ ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసులో పదవ నిందితుడిగా వంశీని చేర్చారు. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు వివరించారు.