English | Telugu

పేద‌ల్ని ఆదుకోవ‌డానికి సీఎం కు మనసు రావట్లేదా?

'ప్రభుత్వ భవనాలకురంగుల కోసం రూ.2600 కోట్లు ఖర్చు పెట్టారు కానీ పేదవారికి సాయం చేయడానికి జగన్‌కు మనసు రావడం లేదు. వాలంటీర్లతో నిత్యావసరాలను డోర్‌ డెలివరీ ఎందుకు చేయడం లేదు?. పేదల ఆకలి కంటే అవినీతికే ప్రాధాన్యత ఇస్తూ జగన్‌ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేల సాయం చేయాలి' అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని అని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాలు కరోనాను నియంత్రిస్తున్నాయని చెప్పుకొచ్చారు.