English | Telugu
మద్యం షాపులు ఏమైనా మెడికల్ షాపులా?
Updated : May 3, 2020
ప్రపంచమంతా కరోనా నివారణకు ఔషధం తయారు చేసే పనిలోఉంటే ..జగన్ మాత్రం కమీషన్ల కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకీ కరోనాకేసులు పెరిగి నిత్యావసర సరకుల దుకాణాలే మూసివేసే పరిస్థితి ఉంటే మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.
మద్యం షాపులు ఏమైనా మెడికల్ షాపులా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోందన్నారు.