ప్రకాశం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. శిద్దా రాఘవరావుతో పాటు ఆయన కుమారుడు సుధీర్ కూడా వైసీపీలో చేరారు. తండ్రీకొడులిద్దరికి సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, శిద్దా రాఘవరావు మంగళవారమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావుకు గ్రానెట్ క్వారీలున్నాయి. వ్యాపారపరమైన ఒత్తిడులు కారణంగానే ఆయన అధికార పార్టీ గూటికి చేరారని ప్రచారం జరుగుతోంది.