English | Telugu

జంతువుల్లా జీవించ‌డం కాదు, మనుషుల్లా మానవత్వాన్ని చూపండి! అక్తర్

ఈ క‌ష్ట స‌మ‌యంలోనైనా క‌నీసం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గం అని పాకిస్తాన్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ సూచించాడు. మనం జంతువుల్లా జీవిస్తున్నాం, మనుషుల్లా మానవత్వాన్ని చూపే సమయం ఇది అని పేర్కొన్నాడు.

క‌రోనా మూడు నెలల తర్వాతైనా అదుపులోకి వస్తుందనే గ్యారంటీ లేదు. ఏ రోజుకు ఆరోజు బ్రతికే వారి గురించి అంతా ఆలోచించాలి. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదు. మనిషి మనిషిలాగా ఉండి కనీసం తమ వంతు సాయం చేయాలి' అని అక్తర్ పేర్కొన్నాడు.

'ఆర్థిక పరిస్థితి బాగున్నవారికి ప్ర‌స్తుత ప‌రిస్థితులు పెద్ద సమస్యగా క‌నిపించ‌డం లేదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నది పేద ప్రజలు మాత్రమే. మనం మనుషుల్లా బ్రతుకుదామా.. లేక జంతువుల్లా ఉందామా. కనీసం తినడానికి తిండి లేనివాడికి సాయం చేయడానికి ప్రయత్నించండి. నిల్వలు పెట్టుకునే మాటే వద్దు. ఒకరికోసం ఒకరు అన్నట్లే ఉండాలి. అవతలి వాడి గురించి మనకెందుకు అనే ధోరణి వద్దు. మనుషులగా ఉండి తోటి వారిని రక్షించుకుందా' అని అక్తర్ పిలుపునిచ్చాడు.

కరోనా వైరస్ ఒక ప్రపంచ సంక్షోభం. మనం దానిని ఎదుర్కోవడానికి ఒక ప్రపంచ శక్తిగా ఆలోచించాలి. ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉంది. ఇందుకు అందరూ సహకరించాలి. అంతేకాని.. గుంపులుగా ఉండడం, మీటింగ్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు' అని అక్తర్ అన్నాడు. రోడ్డుపై ప్రజలు నిర్లక్ష్యంగా ప్రయాణించడాన్ని గమనించా. ఓ బైక్‌పై నలుగురు యువకులు వెళ్తున్నారు. సెలవు కావడంతో వారు విహారయాత్రకి వెళ్తున్నారట. రోడ్డుపైనే కొంత మంది భోజనాలు చేయడాన్ని చూసా. కరోనా ఎక్కువగా మనుషుల కాంటాక్ట్ ద్వారానే వస్తుంది. ప్ర‌జ‌ల‌ నిర్లక్ష్యం కారణంగానే ఎవరూ ఇళ్లలో ఉండటం లేదని అక్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు.