English | Telugu

కాపాడాల్సిన దేవుడే త‌లుపుచాటున దాక్కున్నాడు!

అత్యవసర పరిస్థితుల్లో దైవం తలుపులు మూతపడ్డాయి. వైద్యశాల తలుపులు తెరవబడ్డాయి. దేవుళ్ళు కేవలం కల్పితాలే అని ఓ సూక్ష్మజీవి నిరూపించింది.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా! సృష్టిలో ప్రతి జీవి దైవజ్ఞ తోనే బ్రతుకుతుంది చస్తుంది అంటారు .మరి ఈ covid:19 ఎందుకు సృష్టించినట్లు? ఎందుకు అంతమొందించడం లేదు. పాపం! సర్వశక్తి మంతుడైన దేవుడు కూడా కంటికి క‌నిపించ‌ని వైర‌స్ దెబ్బ‌కు తలుపులు మూసుకున్నాడు. ఇంకా ఎవరిని రక్షించమని కోరేది....?

కరోనా వస్తుందట.. గుడికి వెళ్లొద్దట అనగానే ఇంట్ల కూర్చుంటున్న వారికి కనీస ఆలోచనే రాదు. "అఫ్ట్రాల్ ఒక వైరస్ ను అడ్డుకోలేని దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు సామీ..?" అని పూజారిని అడగలేరు.

"కంటికి కనిపించని పురుగును చూసి మసీదు తలుపుల చాటున అల్లా ఎందుకు దాక్కున్నాడ"ని ఇమాంసాబ్ ను అడగలేరు.

"అందరినీ స్వస్థతపరిచే గుడారాలు అస్వస్థతకుగురౌతుంటే లోక రక్షకుడు ఎటు పోయాడ"ని పాస్టర్లను అడగలేరు. కనీసం.. కనీసం.. తమ మనసులను కూడా అడగలేరు.

ఈ కరోనా ప్రభావం తగ్గనివ్వండి.. మళ్లీ ఆలయాల్లో మంత్రాలు మార్మోగుతుంటాయి. చర్చీలు పభువు పాటలతో, మసీదులు నమాజులతో సందడి చేస్తుంటాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి దేవుడు మనిషిని సృష్టించలేదు. మనిషి యే దేవుని సృష్టించాడంటున్నారు హేతువాదులు.

మా దేవుడు గొప్పా, మా దేవుడు గొప్పా అని... లగాంచి అంటారు కదా? చెప్పండ్రా కరోనా పాజీటీవ్ వచ్చిన వారిని ఏగుడికి,
ఏ మసీద్కి, ఏం చర్చీకి పంపాలో ప్రయాణ ఖర్చులు భారత నాస్తిక సమాజం భరిస్తుంది కాస్త మీ దేవుళ్ళ జాడ చెపండ్రా అంటూ హేతువాదులు ఛాలెంజ్ విసురుతున్నారు.

ఇప్పుడు ఏ బాబా గానీ, ఏ జ్యోతిష్కుడు గానీ, మేమున్నాం అని వాళ్ళ మహిమలు చూపడానికి రారు. ఎవడు " నా తాయెత్తు కట్టుకో తగ్గిపోతుంది " అని చెప్పడు. ఏ ఫాస్టర్ కూడా మహిమ జలమో లేక తైలమో ఇచ్చి ఈ ప్రపంచాన్ని ఆదుకుంటామని ఎవడూ రానే రాడు. మీరొకటి గమనించారా !!! కొన్ని వారాలుగా జగద్వదరుబోతులైన జగ్గీ , రవిశంకర్ ,రామ్ దేవ్ etc.. etc... అడ్రెస్సులు లేవు.

ఇప్పుడు నీకు నాకు ఈ ప్రపంచానికి కుల, మత, వర్గ, జాతి, లింగ, ధనిక, పేద వంటి తేడా లేకుండా ఈ మహమ్మారి నుండి కాపాడేది ఒక్క వైద్యుడే. ఆయన శాస్త్రవేత్త గా మారి అహర్నిశలు కష్టపడుతూ కొంత మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. మతాలన్నీ మరియూ వాళ్ళ వాళ్ళ దేవుళ్ళన్నీ తోకముడిచిన వేళ, సైన్సే ముందుకు దూసుకు వచ్చింది ప్రపంచ మానవాళిని కాపాడటానికి నడుం బిగించింది.

అద్భుత మహిమలు ఉన్నవారని చెప్పినవాళ్లంతా చేతులెత్తేస్తే మీరు కనీసం వారి వైపు ఊహ కూడా మళ్ళించని శాస్త్రవేత్తలు మేమున్నామని అభయమిస్తున్నారు. ఏ కాలంలోనైనా నిజమైన మానవ శ్రేయస్సు కోరేది కేవలం విజ్ఞానమే. మనిషిని కాపాడేది సైన్స్ సహాయంతో, సాటి మనిషే.. అంతేగాని మతమో లేదా దాని వెనుక దాగి ఉన్న దేవుడో కానే కాదు.. !

ఇప్పటికైనాకొత్త ఆలయాలు, విగ్రహాలు, ప్రార్థన స్థలాలు కట్టడం అపి హాస్పిటల్స్ సైన్స్ ల్యాబ్స్ మాత్రమే కట్టే దిశగా మతాలు ముందుకు రావాలి.