ఇండియాలో కూడా కరోనా వైరస్ దెబ్బకు 10 మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో 68 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పరీక్షల్లో అతనికి కోవిడ్-19 పాజిటివ్ తేలింది. అతను సోమవారం మృత్యువాత పడ్డాడు. అతను టిబెట్ సంతతికి చెందినవాడు. మార్చి 15వ తేదీన అమెరికా నుండి ఢిల్లీకి వచ్చాడు. పరీక్షల్లో పాజిటివ్ తేలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మహారాష్ట్ర - ఢిల్లీ - పశ్చిమ బెంగాల్ - కర్ణాటకలలో పలువురు మృత్యువాత పడ్డారు. ఇటలీ నుండి ఇటీవలే వచ్చిన 55 ఏళ్ళ వ్యక్తి కోల్ కతాలో సోమవారంనాడే మృతి చెందాడు. కరోనా కేసులు మార్చి 23 నాటికి 468కి చేరుకున్నాయి. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయినా జనం భయం బుధ్ది లేకుండా గుంపులు గుంపులుగా రోడ్డు మీదకు వస్తున్నారు. ప్రజల్లో మార్పు రాకపోతే మరో ఇటలీగా ఇండియా మారిపోతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ - జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వైరస్ తో ఇప్పట్టి వరకు 15 వేల 189 మంది చనిపోయారని అంచనా వేస్తున్నారు. ఇందులో యూరప్ కి చెందిన వారు అధికంగా ఉన్నారు. 9 వేల 197 మంది చనిపోయారు.