English | Telugu

కమ్మ అయితే, తీసి పక్కన పడేస్తారా?

*ముఖ్యమంత్రి జగన్ తీరుపై రాయపాటి మండిపాటు
*కరోనా తగ్గిన తర్వాత ప్రధాని ని కలుస్తా: మాజీ ఎం.పి. రాయపాటి

వైసీపీ ఫెయిల్యూర్స్ అన్ని ఒక కులం మీద వేసి తప్పించుకుంటున్నారంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలన గుడ్జి ఎద్దు చేలో పడినట్లుగా ఉందని, ప్రతి విషయం లో ఒక కులం అని అంటూ తెగ గోల చేస్తున్నారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం రెడ్డి కులం వారికి తప్ప ఏ ఒక్క కులానికి పోస్టింగ్స్ ఇవ్వటం లేదని, అయినా నోరు యెత్తి అడిగే వారు లేరని రాయపాటి వాపోయారు. " కమ్మ అని తెలిస్తే తీసి పక్కన పడేస్తున్నారు. డిమోషన్.. ఇది మంచిది కాదు.

కుట్రలు వైసీపీ చేసి కమ్మ పై వేస్తే సరి అన్న ప్లాన్లో వాళ్ళు ఉన్నారు," అంటూ రాయపాటి మండిపడ్డారు. రేపు హత్య లు జరిగిన కూడా ఇది ఒక కులం వాడు చేశాడు అని మీ మీద నెట్టేస్తారని, జగన్ కనీసం మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదని,ఎమ్మెల్యేలు అయితే సగం మంది కూడా ఇంకా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని రాయపాటి చెప్పుకొచ్చారు.

" ఎన్నికల కమిషనర్ ను మార్చడం మంచిది కాదు. రమేష్ కుమార్ యొక్క కూతురు, భార్య పేర్లు సోషల్ మీడియా లో పెట్టే విష సంస్కృతి తీసుకుని వచ్చారు," అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రాయపాటి సాంబశివ రావు, ఎన్నికలు వాయిదా వేయకపోతే వేల మంది చనిపోయేవారన్నా విషయం గుర్తు చేశారు. " కరోనా ను సీఎం జగన్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు.వైసిపి ఎమ్మెల్యే ముస్తఫానే క్వారంటైన్ లో ఉన్నాడు అంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కరోనా తగ్గిన తరువాత అమరావతి విషయంలో ప్రధాని తో మాట్లాడతా. రాజధాని మార్పు తో వైసిపి జీరో అవుతుంది," అని జోస్యం చెప్పిన రాయపాటి, ఎప్పుడు ఎన్నికల జరిగినా వైసిపి ఓటమి ఖాయమంటూ ఢంకా బజాయించారు.