English | Telugu

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తెలంగాణ రైతులు

తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలు నీట మునిగాయి, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరకాలం నుంచి పండించిన పంటలు వర్షానికి ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల పంటలన్నీ కూడా నేల పాలయ్యాయి. మూడు రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షాలకు పంట నష్టపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఓ వరిపొలం కురుస్తున్నటువంటి వర్షాలకు, గాలులకు ఒక్కసారిగా అంతా కూడా నేలమట్టం అయినటువంటి పరిస్థితి.

ఈ విధంగా వరి పొలమే కాకుండా మొక్కజొన్న, ప్రత్తి మరియు కూరగాయల పొలాలు కూడా నాశనం అయ్యాయి. అకాల వర్షం వల్ల బాగా దెబ్బతింటుంది రైతాంగం అని దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏదైనా నష్ట పరిహారం చెల్లించి తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులకు కన్నీటినే మిగిల్చాయి, ఈ వర్షం ఇంకా ఐదు రోజుల పాటు కురవనుంది. అప్పులు చేసి మరీ పంటలపై పెట్టుబడులు పెట్టి పంట చేతికందుతుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు వర్షం నిరాశే మిగిల్చింది. అకాలంగా వచ్చిన వర్షం రైతులను అప్పుల పాలు చేయడమే కాక కొందరి రైతులకు బ్రతకడానికి కష్ట తరంగా మార్చింది. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు తమని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.