English | Telugu

ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా

భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. యాక్సియం-4 అంతరిక్ష యాత్ర విజయవంతమైన తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానిని కలిశారు. ఈ నేపథ్యంలో మోదీని కలిసి తన అంతరిక్ష యాత్ర విశేషాలను పంచుకున్నారు. ప్రధాని ఆయనను ఆప్యాయంగా హత్తకుని సరదాగా ముచ్చటించారు.

కాగా శుభాంశు చరిత్రాత్మక మిషన్‌ను ప్రశంసిస్తూ ఇవాళ పార్లమెంట్‌ల్లో ప్రత్యేక చర్చ జరిగింది.మోడీకి శుక్లా యాక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను బహుకరించారు. అలాగే, అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చిత్రాలను చూపించారు. అనంతరం, ఇద్దరూ భారత్‌లో అంతరిక్ష రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు.

కాగా, అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా కీలక పాత్ర పోషించారు. 18 రోజుల ఈ మిషన్‌లో శుక్లా మిగతా వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్‌లో 60 కంటే ఎక్కువ ప్రయోగాలు, 20 అవుట్‌రీచ్ సెషన్‌లను నిర్వహించారు.