English | Telugu

సిద్దేశ్వరస్వామి ఆలయం మొదటి దశ పునర్మిణాన పనులకు భూమి పూజ

తిరుపతి జిల్లా తలకోనలోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో మొదటి దశ పునర్మిణాన పనులకు నేడు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల నిర్మాణం, పునర్మిణాం పనులను వేగవంతం చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు.

మొదటి దశగా సిద్దేశ్వర స్వామి వారి గర్భాలయం, అర్ధమండపం, పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం, మహా మండపం పనులను పునర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మెన్ వెల్లడించారు. ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటికే రూ. 2 కోట్లు టీటీడీ విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నిధులతో పాటు సదరు పనులకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అందిస్తామన్నారు.

వీటితోపాటు ముఖ మండపం, నంది మండపం, రాజ గోపురం, సుబ్రమణ్యస్వామి ఆలయం, వినాయక స్వామి ఆలయం, నవగ్రహ మండపం, అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమండపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు, పోటు, కళ్యాణకట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు.

అంతకుముందు భూమి పూజకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి బోర్డు సభ్యులు శాంతా రామ్, టిటిడి సీఈ టి.వి సత్యనారాయణ, టిటిడి ఎస్ శ్రీ మనోహర్, ఈఈ జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.