English | Telugu

ప్రధాని అఖిలపక్షంతో వీడియో కాన్ఫరెన్స్ భేటి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో కరోనా వైరస్ విజృంభన, లాక్ డౌన్ అమలు చేస్తోన్న అంశాలపై అఖిలపక్ష పార్టీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభలలో కనీసం 5 మంది ఎంపీలున్న పార్టీల నాయకులతో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించారు.

మార్చి 24 న ప్రధాని మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది, అయితే చాలా రాష్ట్రాలు పొడిగింపును కోరాయి., COVID-19 కేసుల్లో పెరుగుదల మరియు రాబోయే వారాల్లో ఇన్‌ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరికల అభిప్రాయాలు వచ్చాయి. దేశంలో కేసుల నమోదు సంఖ్య పెరగడంతో కరోనా వైరస్ పోరాటంపై వీడియోకాన్ఫరెన్స్‌లో చ‌ర్చించారు. క‌రోనా వైరస్‌తో దేశంలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 149 మరణాలు నమోదయ్యాయి.

కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ అలాగే కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బండియోపాధ్యాయ, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, సమాజ్ వాదీ పార్టీ రామ్ గోపాల్ యాదవ్, బిఎస్పి నాయకుడు ఎస్సీ మిశ్రా, లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, డిఎంకె నాయకుడు టిఆర్ బాలు, TRS కేశవరావు, YSR కాంగ్రెస్ విజయసాయి రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.