గతేడాది కంటే ఈసారి రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోకి ప్రవేశించనున్నాయి. గతేడాది మే 18న అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, ఈసారి 16నే ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ, తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లో నైరుతి ఎప్పుడు ప్రవేశిస్తుందన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో భారత వాతావరణ విభాగం ప్రకటన చేసే అవకాశం ఉంది.