English | Telugu

లాక్‌డౌన్‌పై నేడే ప్ర‌ధాని మోడీ కీలక ప్రకటన..?

కరోనా వైరస్ చెలరేగిపోతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తారా.. లేదా అన్న సస్పెన్స్‌ కు నేటితో తెరపడనుంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో దీనిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఈ రోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చిస్తారు. అనంతరం అనంత‌రం ప్ర‌ధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌ను కనుక పొడిగిస్తే ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతమేర సవరించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో కొన్ని రంగాలను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తారని సమాచారం. అయితే వాటిపై పలు ఆంక్షలను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మరోపక్క అన్ని లాక్‌డౌన్ ను పొడిగించాలని ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరారు.