English | Telugu
తెలంగాణ సీఎం రేవంత్ కు మోడీ, చంద్రబాబు బర్త్ డే విషెస్
Updated : Nov 7, 2025
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పలు పార్టీల అధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు రేవంత్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేవంత్ కు మాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎంకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు.