English | Telugu

హైద‌రా.. బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ ఎవ‌రంటే?!

కేటీఆర్, కిష‌న్ రెడ్డిలను హైద‌రాబాద్ బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ గా అభివ‌ర్ణించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీరు హైద‌రాబాద్ కి రావ‌ల్సిన ప్ర‌తి దానినీ ఆపేస్తున్నార‌ని విమర్శించారు. గుజ‌రాత్, ఢిల్లీ, యూపీల్లో స‌బ‌ర్మ‌తి, య‌మున‌, గంగా న‌దుల ప్ర‌క్షాళ‌న చేయొచ్చు.. ఇక్క‌డి మూసీనీ చేయొద్దా అని అడుగుతూ మూసీతో పాటు మెట్రో విస్త‌ర‌ణ‌కు సైతం కి కిష‌న్ రెడ్డి అడ్డు త‌గులున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ని అరెస్టు చేయ‌డ‌డానికి గ‌వ‌ర్న‌ర్ ని అడిగితే అనుమతి ఇవ్వ‌డం లేద‌ని.. కాళేశ్వ‌రం కేసులో కేసీఆర్, హ‌రీష్ ల‌ను అరెస్టు చేయ‌మ‌ని ఈ కేసుపై సీబీఐ ఎంక్వ‌యిరీ వేయ‌మ‌ని కోరితే.. ఢిల్లీ పెద్ద‌ల్లో క‌ద‌లిక లేదని.. దీన్నిబ‌ట్టీ వీరి మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఎలాంటిదో ఒక‌సారి చూసుకోవ‌చ్చనీ అన్నారు రేవంత్.

ఇక హైడ్రా, ఈగ‌ల్ మీద కూడా ప‌డి ఏడుస్తున్నార‌నీ.. హైడ్రా కార‌ణంగా క‌బ్జాల‌కు గురైన వేల కోట్ల రూపాయ‌ల చెరువులు, కుంట‌లు, నాలాలు ఇప్పుడిప్పుడే వెలికి వ‌స్తున్నాయ‌ని.. అదే వారి కాలంలో చివ‌రికి బ‌తుక‌మ్మ కుంట కూడా క‌బ్జా పెట్టార‌ని.. త‌మ హ‌యాంలో ఇవ‌న్నీ వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని అన్నారు సీఎం రేవంత్. వారి జ‌మానాలో ఇవన్నీ క‌బ్జాల‌కు గురై చిన్న చినుకు ప‌డితే హైద‌రాబాద్ చెరువు అయిపోయేద‌ని.. అన్నారు రేవంత్.

కేటీఆర్ హ‌యాంలో స్కూలు ఎదుట కూడా గంజాయ్, డ్ర‌గ్స్ దొరికేలాంటి క‌ల్చ‌ల్ ఏర్ప‌డింద‌ని.. ఆయ‌న హ‌యాంలో ప‌బ్ క‌ల్చ‌ర్ పెరిగినంత మ‌రెక్క‌డా పెర‌గ‌లేద‌నీ.. సొంత బావమరిది ఫామ్ హౌస్ లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీయే ఇందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్య‌మ‌న్నారు రేవంత్. దీంతో ఈగ‌ల్ ప‌నితీరుపై కూడా కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారనీ విమర్శలు గుప్పించారు. గోవాలో లింకులు కూడా త‌మ ఈగ‌ల్ తీగ‌లాగి మొత్తం డ్ర‌గ్స్ నెట్ వ‌ర్క్ ని వెలికి తీస్తుంటే కేటీఆర్ తిక‌మ‌క అయిపోతున్న‌ారని విమర్శించారు.

ఇక ఇంజినీరింగ్ కాలేజీల వ్య‌వ‌హారం చూస్తే వీరు వ్యాపారం చేస్తూ, ప్ర‌జాసేవ చేస్తున్న వారికి మ‌ల్లే పోజులు కొడుతున్నార‌ని, వారు అడిగిన అడ్డ‌గోలు అనుమ‌తులు తాము నిరాక‌రించ‌డం వ‌ల్లే ఈ యాగీ చేస్తున్నార‌నీ, ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ ఇచ్చేదే నాణ్య‌మైన విద్య అందివ్వ‌డానికి అలా జ‌రుగుతుందా లేదా చూడ్డం కూడా త‌ప్పేనా? ఇదే అద‌నుగా భావించి పిల్ల‌ల చ‌దువుగానీ మ‌ధ్య‌లో ఆగితే అంతే తేలిగ్గా వ‌ద‌ల‌మ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. విడ‌త‌ల వారీగా వారికి నిధులు మంజూరు చేస్తామ‌ని అన్నారు.

వీరి ఆగ‌డాల‌కు మంద‌కృష్ణ‌, ఆర్ కృష్ణ‌య్య తోడ‌వుతున్నార‌నీ, ఇక్క‌డ నెల‌కు రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయ‌ం రూ.18,500 కోట్లు మాత్ర‌మే. 6 వేల కోట్ల‌కు పైగా.. కేసీఆర్ చేసిన అప్పుల‌కు ఆర్బీఐ చెప్పా పెట్ట‌కుండానే లాగేసు కుంటోంది. ఇక ఆరు వేల కోట్ల రూపాయ‌లు ఉద్యోగుల జీత, భ‌త్యాలు. మిగిలిన ఖ‌ర్చుల‌తో సంక్షేమ ప‌థ‌కాలు ఇచ్చే దారి క‌నిపించ‌క‌, కొత్త అప్పులు పుట్ట‌క నానా అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తోంది. ఎవ‌రైనా ఇంత‌క‌న్నా మించిన పాల‌న చేస్తామ‌ని ముందుకొస్తే వారికే ఈ మొత్తం పాల‌న అప్ప‌గించేస్తాం ముందుకు రావ‌చ్చ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేవంత్.గోపీనాథ్ కుటుంబ వ్య‌వ‌హారం తాను కూడా మీడియాలో చూశాన‌నీ.. ఒక వేళ అందులో ఏదైనా లోటు పాట్లు ఉంటే బండి సంజ‌య్ ఫిర్యాదు చేస్తే విచార‌ణ చేయిస్తామ‌న్నారు.