English | Telugu
మియాపూర్ రోడ్డుపై 14 అడుగుల లోతులో భారీ గుంత!
Updated : Jun 5, 2020
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ రోడ్డును బ్లాక్ చేసి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డు ఒక్కసారిగా కూలడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఇక్కడ భారీ పైపులైను నిర్మాణం జరిగిందని, ఆ ప్రభావంతోనే ఇప్పుడు రోడ్డు కుంగి గుంత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ గుంతకు సమీపంలోనే మరో చోట కూడా రోడ్డు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గుంత ఏర్పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు.