English | Telugu

ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం.. సమాధానం చెప్పండి జగన్ గారు!

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని, చిన్నఉద్యోగాలకు లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

"50వేలు ఇస్తేనే పేదవాడికి ఇంటిస్థలమా? భూసేకరణ పేరిట మీవాళ్లు కోట్లరూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. అడిగితే బెదిరింపులు..దాడులు. వందలకోట్ల కుంభకోణం.. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదని ప్రజల తరుపున చంద్రబాబు అడుగుతున్నారు చెప్పండి వైఎస్ జగన్ గారు." అంటూ ఉమా ప్రశ్నించారు.

"చిన్నఉద్యోగాలకు లక్షలువసూలు చేస్తున్నారు ఏడాదిపాలనలో అభివృద్ధి ఎక్కడ? కేకులు కట్ చేసుకోవడానికి సంబరాలా? దోసెడు ఇసుక దొరకడంలేదు నీళ్లు అమ్ముకుంటున్నారని మీ ఎంపిలు, శాసనసభ్యులు, మంత్రులు, నాయకులే అడుగుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు." అంటూ ఉమా నిలదీశారు.