English | Telugu
కష్టకాలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు సరికాదు.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్
Updated : May 19, 2020
రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరగదా? అని ప్రశ్నించారు. ఉన్నంతలో కేంద్రం అద్భుతంగా ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంటల విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదని, అలాంటప్పుడు కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
రైతులు, పేద మహిళల ఖాతాల్లో నగదు. 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం. పెన్షన్లు, ఈపీఎఫ్, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే సాయం.. ఇవన్నీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఉపాధి పనులు దినాలు పెంచాం. ఉపాధి నిధులతో తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదా? అని ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో రాజకీయాలను పక్కన పెట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు.