English | Telugu
మహారాష్ట్రలో ఘూర రైలు ప్రమాదం:15 మంది వలస కార్మికులు మృతి
Updated : May 8, 2020
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌరంగాబాద్-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే లాక్‌డౌన్ వల్ల పలువురు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో.. రైల్వే ట్రాక్‌లపై నడుచుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాధిత కూలీలు రైల్వే ట్రాక్‌పై నిద్రించినట్టుగా తెలుస్తోంది. ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలు కొంతమందిపై నుంచి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది" అని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.