English | Telugu

కర్నూలు జిల్లా టీడీపీ నేత హత్య కేసును చేదించిన పోలీసులు

కర్నూలు జిల్లా టీడీపీ నేత మంజుల సుబ్బారావు హత్య కేసును చేధిందించారు పోలీసులు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు వేటకొడవళ్లు, రెండు స్కార్పియో వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. కొలిమిగుండ్ల మండలం చింతలాయి పల్లెకు చెందిన టీడీపీ నేత మంజుల సుబ్బారావు ఈ నెల 17 న హత్యకు గురయ్యారు. బెలూం గుహల దగ్గర టీ తాగుతుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అత్యంత పాశవికంగా నరికి చంపేశారు. కత్తులతో నరికినా కసితీరని దుండగులు నిస్సహాయస్థతిలో ఉన్న సుబ్బారావు పై బండరాళ్లతో కొట్టి దాడి చేసి చంపేశారు.

టిడిపి నేత మర్డర్ జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పోలీసులు రంగం లోకి దిగి నిందితుల కోసం వేట కొనసాగించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట క్రాస్ రోడ్ దగ్గర నిందితులు కనిపించటంతో వారిని అదుపు లోకి తీసుకున్నారు. సుబ్బారావు హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మృతుడు గతంలో నిందితులతో సన్నిహితంగా ఉండేవాడని ఆర్థికంగా కాస్త బలోపేతమైన తరువాత వీరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడంతో తట్టుకోలేకే 11 మంది కలిసి అతన్ని హత్య చేశారని పోలీసులు తెలిపారు. తమ గ్రామ ఆధిపత్యానికి అడ్డొస్తున్నాడనే కారణం గానే హత్య చేసినట్లుగా నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.